Mid Manair Water Released : కరీంనగర్ దిగువ మానేరు జలాశయానికి ఇన్‌ఫ్లోకు అనుగుణంగా నీటి తరలింపును పెంచుతున్నారు. ప్రస్తుతం మధ్యమానేరు నుంచి 15వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తుండటంతో వడివడిగా నీరు ఎల్‌ఎండీకు చేరుతున్నాయి. ఎల్లంపల్లి హెడ్ రెగ్యూలేటర్ ద్వారా విడుదల చేసిన నీటిని నందిమేడారం వద్ద ఉన్న నంది పంప్‌హౌజ్ నుంచి లక్ష్మీపూర్ వద్ద ఉన్న గాయత్రి పంప్‌హౌజ్‌కు చేరవేస్తూ అక్కడి నుంచి మధ్యమానేరుకు తరలిస్తున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా దాదాపు 23వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండటంతో నీరు 18టీఎంసీలకు చేరింది. దిగువ మానేరులో గత మూడు నెలులగా చుక్కనీరు చేరకపోవడంపై ప్రభుత్వం స్పందించింది. మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి రోజుకు 2వేల క్యూసెక్కుల చొప్పున దిగువమానేరు నీటిని విడుదల చేయడం ప్రారంభించింది. కాగా ప్రస్తుతం 15వేల క్యూసెక్కులకు పెంచారు.