ETV Bharat / snippets

కుటుంబ కలహాలతో గొడవ - అత్త చెవిని కొరికేసిన కోడలు

WOMAN BITE EAR IN AP
Woman Bite Mother in Law Ear (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2024, 2:24 PM IST

Woman Bite Mother in Law Ear : ఓ కోడలు అత్త చెవిని అతి దారుణంగా కొరికేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని తుళ్లూరులో ఉంటున్న కంభంపాటి శేషగిరి, పావని (30) దంపతులకు ఇద్దరు కుమారులు. కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో కోడలు పావనికి అత్త నాగమణి (55)కి గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సైతం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఆ సమయంలో కోడలు అత్త చెవిని కొరికేయడంతో ఆ మొత్తం భాగం ఊడిపోయింది. అనంతరం నాగమణిని, తెగిన చెవిని స్థానికులు తుళ్లూరు పీహెచ్‌సీకి, అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆలస్యం కావడంతో తెగిన చెవి అత్తుకోవడం కష్టమని డాక్టర్లు చెప్పినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోయారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.