ETV Bharat / snippets

బావమరిదికి అమృతం పంచి - పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం : కేటీఆర్‌

KTR Comments On CM Revanth
KTR Comments On Amrut Tenders (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2024, 7:09 PM IST

KTR Comments On Amrut Tenders : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. అమృత్ స్కామ్ టెండర్ల విషయంలో బావమరిదితో లీగల్ నోటీసు పంపితే మీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడటం ఆపేస్తాను అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్​మెంట్​లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజమని తెలిపారు.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13ను ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట కూడా నిజమేనన్నారు. శోద అనే కంపెనీ గత రెండు సంవత్సరాలుగా రూ.2 కోట్లు మాత్రమే లాభం ఆర్జించిదన్నారు. దిల్లీలో ఉన్న బీజేపీ దోస్తులు కూడా రేవంత్​ను కాపాడటం కష్టమేనని విమర్శలు గుప్పించారు. ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా, రేవంత్​ రెడ్డి సైతం దొరికాడని, రాజీనామా తప్పదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.