PHC Slab Roof collapsed: నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక చికిత్స కేంద్రం (పీహెచ్సీ)లో స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఆసుపత్రి భవనం పాతది కావడంతో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
నిత్యం వందలాది మంది చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తుంటారు. వైద్యం చేసే డాక్టర్లు, ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వచ్చే రోగులకు భద్రత లేకపోతే ఎలా? అని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి భవనానికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. వీలైతే కొత్త భవనంతో ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.