ETV Bharat / snippets

కుట్రపూరితంగా నాపై అక్రమ కేసులు పెట్టారు : అజారుద్దీన్

Azharuddin Attends for ED Investigation
Azharuddin Attends for ED Investigation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2024, 11:38 AM IST

Updated : Oct 8, 2024, 9:40 PM IST

Azharuddin Attends for ED Investigation : హెచ్​సీఏ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్ ​(హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌ పేర్కొన్నారు. ఇవాళ ఆయన ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన అజారుద్దీన్, ఈడీ అధికారులకు తాను పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. తనపై పెట్టిన కేసులన్నీ అక్రమమని, కుట్రపూరితంగా కావాలనే ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారని ఆయన అన్నారు.

గతంలో ఉప్పల్ పోలీస్ ​స్టేషన్​లో నమోదైన ఎఫ్‌ఐఆర్​ల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్ బాల్స్, జిమ్‌ పరికరాలు, ఫైర్ కిట్లు, ఇతర సామగ్రి కొనుగోలు లాంటి పలు చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే అరోపణలపై ఈడీ విచారణ జరిపింది. కాగా 2020-23 మధ్య హెచ్‌సీఏలో రూ.కోట్లలో అక్రమాలు జరిగినట్లు ఉప్పల్ పీఎస్‌లో పలు ఫిర్యాదులు వచ్చాయి.

Last Updated : Oct 8, 2024, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.