ETV Bharat / snippets

'అర్హత ఉండి కూడా రుణమాఫీ కాని వారి నుంచి 72 వేలకు పైగా ఫిర్యాదులు'

Harish Rao
Harish Rao Comments on Loan Waiver (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 7:12 PM IST

Harish Rao Comments on Loan Waiver : రాష్ట్రంలో అర్హత ఉండి కూడా రుణాలు మాఫీ కాని వారి నుంచి ఇప్పటి వరకు 72 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు తెలిపారు. తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసిన రుణమాఫీ కాల్ సెంటర్​ను పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు వచ్చిన, వస్తున్న ఫిర్యాదుల గురించి ఆరా తీశారు. అన్ని జిల్లాల నుంచి ఇప్పటి వరకు 72 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఆయనకు వివరించారు.

రెండు దఫాల్లో రూ.లక్షన్నర వరకు చేసిన రుణమాఫీ ఫిర్యాదులే ఇన్ని ఉన్నాయని హరీశ్​రావు తెలిపారు. అర్హత ఉండి కూడా చాలా మంది రుణాలు వివిధ కారణాలతో మాఫీ కావడం లేదని అన్నారు. మూడో దఫా ప్రక్రియ కూడా పూర్తయ్యాక ఫిర్యాదులను గవర్నర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హరీశ్​రావు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.