Film Artist who Committed Suicide : సినిమా ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రికి చెందిన స్వప్న వర్మ(33) మాదాపూర్‌లోని కాకతీయహిల్స్ కాలనీలో నివాసం ఉండేది. సినీ పరిశ్రమలో చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లకు అసిస్టెంట్‌గా పనిచేస్తుండేది.
ఆరు నెలల నుంచి ఎటువంటి ఉపాధి లేకపోవడంతోనే స్వప్న ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 'ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి ఆత్మహత్య చేసుకుంటాను' తన స్నేహితురాలితో బాధితురాలు చాటింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు వచ్చాక కేసు దర్యాప్తు చేపడతామని సీఐ వివరించారు.