RICE MILL CHECKING IN HANMAKONDA: హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మండలం పున్నేలులో నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్‌పై సివిల్ సప్లై, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 2022-23 రబీ సీజన్‌కు గాను 50,363 బస్తాల ధాన్యం సీఎంఆర్‌గా ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మొత్తం రూ.4.47 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. గత కొంతకాలంగా మిల్లర్ జాప్యం చేస్తుండడంతో సివిల్ సప్లై శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు తనిఖీ చేశారు. ఎఫ్‌సీఐకి సంబంధించిన ధాన్యం లేకపోవడంతో మిల్లు నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హన్మకొండ జిల్లాలో మిల్లర్ల మాయాజాలం
Published : Sep 21, 2024, 1:46 PM IST