Matka Pre Release Event : మెగా హీరో వరుణ్ తేజ్- మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మట్కా'. డైరెక్టర్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వేదికగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
'16 సంవత్సరాల నుంచి 52 ఏళ్ల వయసు వరకూ సాగిన వాసు అనే వ్యక్తి జీవితమే ఈ సినిమా స్టోరీ. అన్నం కోసం, ప్రతి రూపాయి కోసం కష్టపడుతూ మట్కా కింగ్‌లా ఎలా ఎదిగాడన్నది సినిమాలో చూపించాం. 'గద్దలకొండ గణేష్' తర్వాత కొంచెం కొత్త ప్రయత్నం చేశాను. ఈసారి అందరికీ నచ్చేలా మాస్ సినిమా చేయాలనుకున్న సమయంలో కరుణకుమార్ కలిసి ఈ కథ చెప్పారు. సినిమా విడుదల తర్వాత ఆయన గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఈ సినిమా థియేటర్లలో పక్కాగా దుమ్ము దులిపేస్తుంది. 'విశాఖపట్నం అంటే సముద్రం గుర్తుకు రావాలి, లేదంటే ఈ వాసుగాడు గుర్తుకు రావాలి' అనే ఓ డైలాగ్ సినిమాలో ఉంటుంది. ఆ డైలాగ్‌కు తగ్గట్లే వాసు థియేటర్లో ప్రేక్షకులను మెప్పిస్తాడు.
THANK YOU VIZAG ❤️🔥❤️🔥❤️🔥
— Vyra Entertainments (@VyraEnts) November 10, 2024
From the heartfelt cheers to the electrifying atmosphere all over, the City of Destiny showered the team of #Matka
with their unstoppable energy and love, making the PRE RELEASE EVENT truly unforgettable😍
IN THEATERS FROM NOVEMBER 14th#MATKAonNOV14th pic.twitter.com/BW02QZ4QdE
నా సినిమానే మాట్లాడాలని నమ్మే వ్యక్తిని నేను. మూడు రోజుల కిందట ఈ సినిమా లావణ్యతో మాట్లాడా. మర్నాడు ఉదయం మా అన్నయ్య రామ్‌చరణ్ ఫోన్ చేశాడు. ఆయన నోరు తెరిచి పది మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. పక్కన కూర్చుని భుజంమీద చేయి వేస్తే అదే నాకు రూ.వందకోట్లు. ఎమోషనల్‌గా ఆయన ఎప్పుడూ నాకు అండగానే ఉన్నాడు. ఎప్పుడూ కుటుంబం గురించే మాట్లాడతా అని అనుకోవచ్చు. జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మర్చిపోతే ఆ విజయం దేనికీ పనికి రాదు. మా పెదనాన్న, బాబాయ్, మా నాన్న నా వెనకాల ఉన్నారు. నేను ఎక్కడున్నా తనకంటే ఎక్కువగా నన్ను చూసుకుంటూ సహకారం అందిస్తోంది నా భార్య లావణ్య. ఈ సినిమా కోసం పనిచేసిన సహనటులు, టెక్నీషియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత రెండు సినిమాల విషయంలో నా టార్గెట్ మిస్ అయ్యా. కానీ, ఈసారి మాత్రం గట్టిగా కొడుతున్నా' అని వరుణ్ అన్నారు.
'బన్నీని పెదనాన్న కొట్టేవారు- అల్లు, కొణిదెల కుటుంబాలకు ఆయనే హెడ్మాస్టర్'