ETV Bharat / sports

భారత్ జోరుకు బ్రేక్- లో స్కోరింగ్ మ్యాచ్​లో సౌతాఫ్రికా విన్ - IND VS SA 2ND T20

భారత్ జోరుకు బ్రేక్- పోరాడి ఓడిన టీమ్ఇండియా- టీ20 సిరీస్​లో సౌతాఫ్రికా బోణీ

IND Vs SA 2nd T20
IND Vs SA 2nd T20 (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 11, 2024, 6:33 AM IST

IND Vs SA 2nd T20 : స్వదేశంలో భారత్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో సౌతాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. సెయింట్ జార్జి పార్క్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్​లో భారత్ నిర్దేశించిన 125 స్వల్ప లక్ష్యాన్ని సఫారీ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ట్రిస్టన్ స్టబ్స్ (47 పరుగులు) రాణించాడు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో సత్తా చాటినా వృథా అయ్యింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్ 1-1తో సమం అయ్యింది.

రేస్​లోకి వచ్చినట్లే అనిపించినా
స్వల్ప లక్ష్యాన్ని సఫారీ జట్టు ఈజీగా ఛేదించేస్తుందని అనుకున్నారంతా. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. స్పిన్​కు అనుకూలించిన పిచ్​పై పరుగులు చేయడం సఫారీ జట్టుకు కూడా కష్టమైంది. 66 పరుగులకే సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయింది. టీమ్ఇండియా స్పిన్ మాంత్రికుడు వరుణ్ చక్రవర్తి ప్రత్యర్థిని తీవ్రంగా దెబ్బకొట్టాడు. దీంతో భారత్ విజయంపై ఆశలు చిగురించాయి. కానీ, పట్టు వదలని సఫారీ జట్టు ఆఖర్లో పోరాడింది. ట్రిస్టన్ స్టబ్స్ , గెరాల్డ్ కాట్జీ (19 పరుగులు)తో కలిసి మ్యాచ్ ముగించేశాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య (39* పరుగులు) టాప్ స్కోరర్. ఓపెనర్లు అభిషేక్ శర్మ (4), సంజూ శాంసన్ (0) విఫలమయ్యారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (4), రింకూ సింగ్ (9) నిరాశపర్చారు. తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) ఫర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌, కొయెట్జీ , సిమిలానె , మార్‌క్రమ్‌ , ఎంగబా పీటర్‌ తలో వికెట్ దక్కించుకున్నారు.

కాగా, తాజా ఓటమితో టీ20ల్లో భారత్ విజయ పరంపరకు బ్రేక్ పడింది. 2024 జులై నుంచి ఈ మ్యాచ్​కు ముందు వరకు టీ 20ల్లో భారత్ వరుసగా 11 మ్యాచ్​ల్లో నెగ్గింది.

సిక్సర్​గా స్టేడియం దాటిన బంతి - జేబులో పెట్టుకుని పరారైన వ్యక్తి!

ఒకే ఏడాదిలో 100 సిక్స్​లు - క్లాసెన్ కెరీర్​లో రేర్​ రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.