Cyber Crime Cases In Hyderabad : సైబర్ నేరాలకు తాజాగా మరో ఇద్దరు నగర వాసులు బలయ్యారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి మార్వారీ సెక్యురిటీస్ ఫైనాన్షియల్ లిమిటెడ్ పేరిట ట్రేడింగ్ ఖాతా ఇస్తామని మెసేజ్ వచ్చింది. బాధితుడు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి లాభాలు సైతం పొందాడు. తర్వాత 19 లక్షల 25వేల రూపాయల లాభం తన ఖాతాలో జమయ్యాక వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు 25 శాతం తమకు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేయడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో కేసులో బాధితుడికి ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పిన సైబర్ నేరస్థుడు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి బురిడీ కొట్టించాడు. అతని మాటలు నమ్మి వివరాలు చెప్పిన తర్వాత అతని ఖాతానుంచి లక్ష 22వేల 350 రూపాయలు ఖాళీ కావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాద్లో ట్రేడింగ్ పేరిట మోసానికి మరొకరు బలి
Published : Jul 24, 2024, 9:44 PM IST