ETV Bharat / snippets

ఉప్పల్​లో మహిళ దారుణ హత్య - పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 3:45 PM IST

Uppal Murder Case Accused surrenders to police
Uppal Woman Murder Case (ETV Bharat)

Uppal Woman Murder Case : హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నాం చంద్రమౌళి (47)అనే వ్యక్తి ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద స్థిరాస్తి కార్యాలయం నిర్వహిస్తున్నాడు. కార్యాలయంలో వివేక్ నగర్​కు చెందిన కొమ్మవారి మంజుల (45) పనిచేస్తుంది. చంద్రమౌళికి మంజులతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. కొన్ని రోజుల నుంచి మరో వ్యక్తితో మంజుల సన్నిహితంగా ఉందని చంద్రమౌళి అనుమానం పెంచుకున్నాడు.

అంతేకాకుండా అతని వద్ద రూ.28 లక్షలు తీసుకుందని, అడిగితే ఇవ్వడం లేదని ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి, మంజులను ఉప్పల్ హెచ్ఎండీఏ లేఅవుట్​కు తీసుకొచ్చి, కారుతో ఢీకొట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడి నుంచి నేరుగా పోలీసు స్టేషన్​కు వెళ్లి చంద్రమౌళి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.