BORABANDA CONSTABLE DIED : హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సాయికుమార్ (42) గుండెపోటుతో దుర్మరణం చెందారు. 24 గంటలు విధులు నిర్వహించిన సాయికుమార్ ఇంటికి వెళ్లాడు. నైట్ డ్యూటీ చేసిన అతను స్నానం చేసి తర్వాత తన తండ్రితో మాట్లాడుతూ ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి అమీర్‌పేట్‌లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా సాయికుమార్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ కుమారుడు మరణించినట్లు ఊహించలేకపోతున్నామని అతని తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.