Young Man Commits Suicide : ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి నష్టపోయిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. అందోల్ గ్రామానికి చెందిన దాసరి మధు అనే యువకుడు బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. పొలం కోసమని తండ్రి ఇచ్చిన డబ్బులను బెట్టింగ్‌లో పెట్టి నష్టపోయాడు. ఇంట్లో విషయం చెబితే మందలిస్తారన్న భయంతో మూడు రోజుల క్రితం గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తల్లిదండ్రులు అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.