Team India Head Coach : టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవి కోసం ఈ నెల బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేయగా గడువు ముగిసే సమయానికి దాదాపు 3వేల దరఖాస్తులు అందాయని తెలిసింది. అయితే వీటిలో భారీ సంఖ్యలో నరేంద్రమోదీ, అమిత్ షా, సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ పేర్లతో నకిలీలు వచ్చాయి. బీసీసీఐ ఇప్పుడు వాటిని ఏరివేసే పనిలో ఉందట. కాగా, ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరి నాటికి ముగుస్తుంది. కొత్త కోచ్ పదవీకాలం జులై 1 నుంచి మొదలై 2027 డిసెంబరు 31 వరకు మూడున్నరేళ్ల పాటు ఉంటుంది. అయితే ఈ కోచ్ పదవి కోసం ఇప్పటికే పలువురు మాజీ దిగ్గజాల పేర్లు వినిపించగా మరోసారి ఇండియన్ ప్లేయరే ఉంటాడా? లేదా విదేశీ కోచ్‌వైపు బీసీసీఐ మొగ్గు చూపుతుందో తెలియాల్సి ఉంది.
ఫేక్ అప్లికేషన్స్ - టీమ్ఇండియా హెడ్ కోచ్ రేసులో మోదీ, అమిత్ షా!
Published : May 28, 2024, 11:40 AM IST