ETV Bharat / snippets

రోహిత్ ఆనందభాష్పాలు - నవ్వించిన కోహ్లీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 9:34 AM IST

source Getty Images
Rohith Kohli (source Getty Images)

T20 Worldcup 2024 Rohithsharma Tears : టీ20 వరల్డ్​కప్​ 2024 సెమీఫైనల్​లో భాగంగా ఇంగ్లాండ్​పై టీమ్​ఇండియా విజయం సాధించింది. దాదాపు పదేళ్ల తర్వాత ఫైనల్​కు చేరింది. అయితే విజయానంతరం రోహిత్​శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. ఫైనల్‌కు భారత్​జట్టు చేరిన ఆనందంలో రోహిత్ కళ్లల్లో ఆనందభాష్ఫాలు కనిపించాయి. అయితే ఆ సమయంలో ఎమోషనల్ అవుతున్న రోహిత్‌ను కోహ్లీ డైవర్ట్ చేయడానికి సరదాగా నవ్వించడానికి ట్రై చేశాడు. ప్రస్తుతం దీనికి సంబధించిన వీడియో వైరల్​ అవుతోంది. కాగా, హిట్​మ్యాన్​ కెప్టెన్‌‌గానే కాకుండా బ్యాటర్‌గానూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ప్రస్తుత టోర్నీలో మూడు అర్ధశతకాలు బాదాడు. బలమైన ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​పై భారత్ సాధించిన విజయాల్లో బ్యాటర్‌గా కీలకంగా వ్యవహరించాడు. ఇకపోతే గతేడాది రోహిత్​శర్మ సారథ్యంలోనే భారత్ వన్డే వరల్జ్​కప్​ను తృటిలో చేజార్చుకుంది. ఫైనల్‌లో తడబడి ఆసీస్​పై ఓడింది. మళ్లీ ఇప్పుడు టీ20 వరల్డ్​కప్​ టైటిల్ లక్ష్యంగా మెరుగైన ప్రదర్శన చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.