ETV Bharat / snippets

విజయంతో కెరీర్ ముగించిన జేమ్స్ అండర్సన్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 5:43 PM IST

source Associated Press
JamesAnderson Retirement Last Test Match (source Associated Press)

JamesAnderson Last Test Match : లార్డ్స్‌ టెస్టులో వెస్టిండీస్​పై ఇంగ్లాండ్​ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ 371పరుగులు చేయగా వెస్టిండీస్ తొలిఇన్నింగ్స్‌లో 121, రెండోఇన్నింగ్స్‌లో 136 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్​ 114 పరుగుల తేడాతో గెలిచింది. కాగా ఈ పోరులో ఇంగ్లాండ్​ బౌలర్ అట్కిన్సన్ తొలి ఇన్నింగ్స్‌లో 7, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి జట్టు విజయంలో హీరోగా నిలిచాడు. అలానే జేమ్స్​అండర్సన్​ ఈ మ్యాచ్ విజయంతో తన 21ఏళ్ల కెరీర్​ను ముగించాడు. ఈ ఫాస్ట్ బౌలర్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచ్​లో అతడు నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. 2002లో అరంగేట్రం చేసిన అండర్సన్​ తన కెరీర్‌లో 188టెస్టులు ఆడి 704 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో 700కుపైగా వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్​బౌలర్ అండర్సన్. వన్డేల్లోనూ 269 , టీ20ల్లో 18 వికెట్లు దక్కించుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.