టీ20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇటీవలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌పై గెలుపొందిన భారత్, ఆసీస్‌పై కూడా నెగ్గి హ్యాట్రిక్ విజయాలతో నేరుగా సెమీస్‌కు చేరుకోవాలనుకుంటోంది.
ఈ టోర్నీలో పెద్దగా రాణించని కోహ్లీ, శివమ్ దూబే అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో దూసుకెళ్లడం టీమ్ఇండియాకు కలిసి వచ్చిన అంశం. హర్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ పెర్ఫామెన్స్ సత్తా చాటగా, స్పిన్నర్ కులదీప్ యాదవ్ మిడిల్ ఓవర్లలో వికెట్లతో రాణిస్తున్నాడు. పేసర్లు బుమ్రా, అర్షదీప్ చక్కని పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు.
మరోవైపు బంగ్లాదేశ్‌పై గెలిచి అఫ్గాన్ చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్న ఆసీస్, ఇప్పుడు సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఫలితంపై ఆసీస్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్ స్పిన్నర్లకు కూడా సహకరించే అవకాశాలు ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.