Rohit Virat Jersey: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ల (45, 18)ను రిటైర్ చేయాలని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ఈ ఇద్దరు స్టార్లు టీమ్ఇండియాకు ఎన్నో విజయాలు అందించారని, వాళ్లను చూసి యువతరం స్ఫూర్తి పొందాలని రైనా అన్నాడు. 'జెర్సీ నెంబర్లు 45, 18ని రిటైర్ చేయాలని బీసీసీఐ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ నెంబర్లను చూసి యువతరం స్ఫూర్తి పొందాలి. సచిన్, ధోనీకు దక్కిన గౌరవం రోహిత్, విరాట్‌కు కూడా లభించాలి. వాళ్ల జెర్సీ నెంబర్లను రిటైర్ చేసినట్లు వీరిద్దరి నెంబర్లు కూడా ఎవరికీ ఇవ్వకూడదు' అని రైనా అన్నాడు. కాగా, రోహిత్, విరాట్ గత కొన్నేళ్లుగా టీమ్ఇండియాకు అన్ని ఫార్మాట్లలో వెన్నుముకగా నిలుస్తున్నారు. ఇక టీ20 వరల్డ్‌కప్ అనంతరం వీరిద్దరూ పొట్టిఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు.
45, 18 నెంబర్ జెర్సీలను రిటైర్ చేయాలి- యువతరానికి వాళ్లే స్ఫూర్తి!
Published : Jul 5, 2024, 12:37 PM IST