ETV Bharat / snippets

రోహిత్, విరాట్ తర్వాత ఎవరు? BCCI బాస్​ ఏమన్నారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 12:21 PM IST

Roger Binny About Rohit Virat
Roger Binny About Rohit Virat (Source: Associated Press)

Roger Binny About Rohit Virat Retirement: టీ20 వరల్డ్​కప్​ విజయం తర్వాత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్​కు రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు 17ఏళ్లుగా టీమ్ఇండియాకు టీ20ల్లో ప్రాతినిధ్యం వహిస్తూ జట్టుకు అనేక విజయాలు అందించిన ఈ స్టార్లు ఇకపై ఈ ఫార్మాట్​లో కనిపించరు. ప్లేయర్లుగా, కెప్టెన్​లుగా జట్టు బాధ్యతలు మోస్తూ ముందుకు నడిపించారు. అయితే ఇప్పుడు వీరి స్థానాలు భర్తీ చేసేది ఎవరా అని సందిగ్ధం నెలకొంది. దీనిపై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు.

'రోహిత్, విరాట్ జట్టుకు ఎంతో కృషి చేశారు. ఎప్పటిలాగే ఈ ఇద్దరూ ఐపీఎల్, వన్డే, టెస్టుల్లో ఆడతారు. కానీ, టీ20ల్లో వీరి స్థానాలను భర్తీ చేయడానికి 2-3ఏళ్లు పడతుంది. ప్రస్తుతం ఐపీఎల్​లో చాలామంది ప్రతిభావంతులున్నారు. చాలామంది క్రికెటర్లు అక్కడ్నుంచే వస్తున్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్లు లేని లోటు పూడ్చడానికి కాస్త సమయం పడుతుంది' అని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.