US Election 2024 Joe Biden : అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని తనపై ఎలాంటి ఒత్తిడిలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టంచేశారు. నవంబరు 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తానే డెమెక్రాటిక్ పార్టీ అభ్యర్థినని ఆయన తేల్చి చెప్పారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చల్లో బైడెన్ పూర్తిగా తేలిపోవడం వల్ల అధ్యక్ష బరి నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికన్ మీడియాలో ప్రచారం జరిగింది. డెమోక్రాటిక్ పార్టీ అంతర్గతంగా ఇదే చర్చిస్తోందని ఊహాగానాలు వెలువడ్డాయి. బైడెన్ మాత్రం తాను తప్పుకోవడంలేదని, తుదివరకూ బరిలోనే ఉంటానని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సాయంతో తాను నవంబరులో జరిగే ఎన్నికల్లో ట్రంప్‌ను ఒడిస్తానని నిధుల సమీకరణ ఈ-మెయిల్‌లో బైడెన్ పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఓడావన్నది కాదు, ఎంత త్వరగా తిరిగి పుంజుకున్నావన్నదే ముఖ్యమని తన తండ్రి చెప్పారని బైడెన్ అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
'నేనే డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని- ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడిస్తా'- జో బైడెన్ స్పష్టం
Published : Jul 4, 2024, 12:24 PM IST