Nepal PM KP Sharma Oli Wins Vote Of Confidence : నేపాల్ కొత్త ప్రధానిగా ఇటీవల నియమితులైన కేపీ శర్మ ఓలి విశ్వాస పరీక్షలో నెగ్గారు. ఆదివారం పార్లమెంటులో నిర్వహించిన బలపరీక్షలో ఆయన సునాయాసంగా గెలిచారు. నేపాల్ పార్లమెంటు ప్రతినిధుల సభలో మొత్తం 263మంది సభ్యులు ఉండగా, కేపీ శర్మ ఓలి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 188ఓట్లు, వ్యతిరేకంగా 74 ఓట్లు వచ్చాయి. ఒక సభ్యుడు గైర్హాజరయ్యారు. నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్ -యూఎంఎల్, లోక్‌తంత్రిక్ సమాజ్‌వాదీ పార్టీ, జనతా సమాజ్‌వాదీ పార్టీ నేపాల్ ప్రతినిధులు కేపీ ఓలి శర్మకు అనుకూలంగా ఓటేశారు. సీపీఎన్- మావోయిస్టు సెంటర్, సీపీఎన్ -యూనిఫైడ్ సోషలిస్ట్, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు.
విశ్వాస పరీక్షలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి విజయం
Published : Jul 21, 2024, 9:40 PM IST