Malawi Vice President Dead : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం మరవకముందే మలావీ ఉపాధ్యక్షుడు విమాన ప్రమాదంలో మృతిచెందారు. ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమాతో పాటు మరో 9మంది ఈ ప్రమాదంలో మరణించారని మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ధ్రువీకరించారు. ఒక రోజుకు పైగా గాలింపు చర్యల తర్వాత ఉత్తరాన విఫ్య పర్వతాల్లో సైనిక విమానం శకలాలను గుర్తించారు. సోమవారం మలావీ రాజధాని లిలాంగ్వే నుంచి 370 కిలోమీటర్ల దూరంలోని మజూజు నగరానికి చిలిమా ఉన్న సైనిక విమానం బయల్దేరింది. విమానంలో మాజీ అధ్యక్షురాలుతో పాటు మొత్తం ఏడుగురు ప్రయాణికులు ముగ్గురు సైనికసిబ్బంది ఉన్నారు. బయల్దేరిన కొంతసేపటికి వాతావరణం ప్రతికూలంగా మారడం వల్ల విఫ్య పర్వతాల మీదుగా ఎగురుతుండగా విమానంతో ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్‌కు సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు విమానం కుప్పకూలిన ప్రదేశాన్ని సహాయక బృందాలు గుర్తించాయి.
విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు దుర్మరణం- మరో 9మంది మృతి
Published : Jun 11, 2024, 5:53 PM IST