Malawi Vice President Plane Missing : ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా మరో తొమ్మిది మందిని తీసుకెళుతున్న సైనిక విమానం అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన విమానం సుమారు 45 నిమిషాల అనంతరం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే ఎంతసేపైనా ఉపాధ్యక్షుడి విమానం జాడ తెలియరాలేదు. అదే సమయంలో దానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. రాడార్‌తో సంబంధాలు కోల్పోవడంతో విమానం జాడను కనిపెట్టడం కష్టంగా మారిందని మలావీ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. విమానం గల్లంతైన సంగతి తెలియగానే అధ్యక్షుడు లాజరస్ చక్వేరా బహమాస్ పర్యటన రద్దు చేసుకున్నారు. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మలావీ ఉపాధ్యక్షుడి విమానం మిస్సింగ్- గాలింపు చర్యలు ముమ్మరం
Published : Jun 11, 2024, 6:47 AM IST