Indian Students Returned From Bangladesh : ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించాలంటూ బంగ్లాదేశ్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న పలువురు భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు సుమారు 6,700 మంది విద్యార్థులను స్వదేశానికి తరలించినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. వివాదస్పద ఉద్యోగ కోటా విధానాన్ని రద్దు చేయాలని షేక్ హసీనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులతో బంగ్లాదేశ్ ఘోరమైన ఘర్షణలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘర్షణల్లో వంద మందికి పైగా మృతి చెందారు. పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని ఆశిస్తున్నట్లు జైశ్వాల్ తెలిపారు.
బంగ్లా నుంచి భారత్కు 6700మంది విద్యార్థులు- పరిస్థితులు నార్మల్గా మారాలన్న అధికారులు!
Published : Jul 25, 2024, 7:59 PM IST