Israel Attack On Gaza : గాజాలోని ఓ పాఠశాలతో పాటు ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో సుమారు 30మంది ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ గాజాలోని డీర్‌అల్-బలా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 100 మంది గాయపడ్డారు. ఖాన్‌యూనిస్‌ను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హుకూం జారి చేసిన కొంతసేపటికే పాఠశాల, ఆస్పత్రిపై దాడి జరిగింది. మరో దాడిలో 11 మంది మృతి చెందినట్లు సమాచారం. ఖాన్‌యూనిస్ సిటీ నుంచి సోమవారం ఒక్కరోజే లక్షా 50వేల మంది ఖాళీ చేసి వెళ్లిపోయారని ఐరాస వెల్లడించింది. గత అక్టోబర్ నుంచి హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటన సందర్భంలో అమెరికన్‌లు పెత్త ఎత్తున నిరసనలు చేశారు. ఈ క్రమంలో హమాస్‌తో త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని యుద్ధం ముగించాలని నెతన్యాహుకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సూచించారు.
స్కూల్, హాస్పిటల్‌పై ఇజ్రాయెల్ దాడి- చిన్నారులు సహా 30మంది మృతి
Published : Jul 27, 2024, 10:25 PM IST