Vishwak Sen Organ Donation : మాస్ కా దాస్ విష్వక్ సేన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం తాన అవయవాలను దానం చేయనున్నట్టు ప్రతిజ్ఞ చేశారు. హైదరాబాద్లో ఇటీవలె 'మెట్రో రెట్రో' పేరిట జరిగన అవయవ దాన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా అవయవదాన సంస్థకు వ్యక్తిగత వివరాలు అందించిన విష్వక్ 'దాత అనుమతి కార్డు'ను పట్టుకుని ఫొటో దిగారు. దాన్ని నెట్టింట షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు, ఆయన్ను ప్రశంసిస్తున్నారు. తాను తీసుకున్న డెసిషన్ను మెచ్చుకుంటున్నారు. ఈ పనితో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారంటూ కామెంట్లు పెడుతున్నారు.