ETV Bharat / snippets

OTTలోకి విజయ్ 'మహరాజ'- స్ట్రీమింగ్ ఎప్పట్నుంచంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 12:53 PM IST

Maharaja Movie OTT
Maharaja Movie OTT (Source: ETV Bharat)

Maharaja Movie OTT:కోలీవుడ్​ స్టార్ హీరో విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమాతో రీసెంట్​గా హిట్ కొట్టారు. జూన్ 14న రిలీజైన ఈ సినిమా తెలుగు, తమిళం సహా అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. డైరెక్టర్ నిథిలన్‌ స్వామినాథన్‌ ఈ సినిమా తెరకెక్కించారు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించి దాదాపు రూ.100 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా ఇక ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్​లో జులై 12నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ తెలిపింది.

కాగా, విజయ్ కెరీర్​లో 50వ సినిమాగా ఇది తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆయన నటనే సినిమాకు ప్లేస్ పాయింట్ అయ్యింది. ఇందులో మమతా మోహన్‌దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సుదాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి నిర్మించగా, అజనీశ్ లోక్​నాథ్ సంగీతం అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.