Samantha Reacts on Doctors Jail Warning : సమంతను జైల్లో పెట్టాలంటూ ఓ డాక్టర్ ఇచ్చిన వార్నింగ్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే డాక్టర్ వార్నింగ్ పోస్ట్‌పై సమంత స్పందించింది. తాను తీసుకుంటున్న వైద్యం ఎంతో ఖరీదైనదని, కానీ అందరూ అలాంటి వైద్యం తీసుకోలేరు కాబట్టి అందుకే వైద్యుల సలహా మేరకు తాను హెల్త్ టిప్స్ చెప్తానని పేర్కొంది. "ఏ విషయం గురించి తెలుసుకోకుండా మరొకరికి సలహాలు ఇచ్చేంత అమాయకురాలిని కాదు. నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్‌కు 25 ఏళ్ల సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంది. నన్ను నిందించడం కన్నా నా డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొనాల్సింది. అయినా ఆయన నా గురించి మాట్లాడేటప్పుడు అలాంటి పదాలు వాడకపోయి ఉంటే కచ్చితంగా ఆయన్ను గౌరవించేదాన్ని. నేను సెలబ్రిటీని కాబట్టి అలా నిందించి ఉంటారు. ఏదేమైనా నేను ఒక సామాన్య వ్యక్తిగా మాత్రమే హెల్త్ టిప్స్ గురించి పోస్ట్ చేశాను." అని రాసుకొచ్చింది.
వార్నింగ్ ఇచ్చిన డాక్టర్‌కు సమంత స్ట్రాంగ్ రిప్లై!
Published : Jul 5, 2024, 3:41 PM IST