Mega Allu Family: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ఆయ్'. శుక్రవారం ఈ సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసుకు మెగా- అల్లు ఫ్యామిలీమధ్య ఏమైనా ఇష్యూ ఉందా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సమాధానమిచ్చారు.
'నేను 20ఏళ్లుగా మెగా-అల్లు ఫ్యామిలీ బాండింగ్ చూస్తున్నా. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసే ఉండాలని చిరంజీవి కోరుకుంటారు. అందుకే ఆయన ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారు. అంతమంది స్టార్లను తీసుకెళ్లడం మాములు విషయం కాదు. ఓ ఫ్యామిలీలోనైనా కొన్ని సందర్భాల్లో ఇష్యూస్ రావడం సహజమే. అంతమాత్రాన బంధం చెడిపోదు. ఇవన్నీ తాత్కాలికమే. వారి బంధం గురించి నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు అన్ని సర్దుకుంటాయి. 'మేమంతా ఒక్కటే' అని చెప్పేందుకు ఒక్క సందర్భం చాలు. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్' అని బన్నీ అన్నారు.