Hero Suriya Blood Bank : తన అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు హీరో సూర్య. తన పుట్టినరోజును(ఈ నెల 23) పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరై రక్తదానం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, సూర్య పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఫ్యాన్స్ ప్రతిఏడాది తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలా గతేడాది 2000 మంది రక్తదానం చేశారు. అప్పుడు 2024లో నిర్వహించే రక్త దాన శిబిరానికి హాజరవుతారని సూర్య అభిమానులకు మాటిచ్చారు. చెప్పినట్టుగానే తాజాగా రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన రక్త శిబిరాన్ని సందర్శించారు. అక్కడ రక్తదానం చేశారు. అనంతరం అభిమానులతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఇదే క్యాంపులో 400 మంది సూర్య ఫ్యాన్స్ కూడా బ్లడ్ ఇచ్చారు. ఇకపోతే సూర్య శివ దర్శకత్వంలో నటించిన ఫాంటసీ యాక్షన్ఫిల్మ్ కంగువ అక్టోబరు 10న విడుదల కానుంది.
మాట నిలబెట్టుకున్న హీరో సూర్య - ఏం చేశారంటే?
Published : Jul 15, 2024, 8:53 PM IST