ETV Bharat / snippets

బన్నీకి వరలక్ష్మి వెడ్డింగ్ ఇన్విటేషన్- స్పెషల్​గా కాబోయే భర్తతో!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 5:40 PM IST

varalaxmi sarathkumar
varalaxmi sarathkumar (Source: ETV Bharat)

Varalaxmi Sarathkumar Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ను తన వివాహానికి ఆహ్వానించింది నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. కాబోయే భర్త నికోలాయ్ సచ్​దేవ్​తో కలిసి బన్ని ఇంటికెళ్లిన వరలక్ష్మీ తమ వెడ్డింగ్ కార్డ్ అందించింది. బన్నితోపాటు ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​ను కూడా పెళ్లికి ఆహ్వానించింది. ఇద్దరితో ఈ జంట కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ ఫొటోలను వరలక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులను, రాజకీయ నాయకులను వరలక్ష్మి స్వయంగా కలిసి వివాహానికి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్​కు ఆహ్వానం అందించింది. కాగా, జూలై 2న వీరి వివాహం జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.