Sharad Pawar Z Plus Security : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ తన నుంచి రహస్యాలు తెలుసుకునేందుకే తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించి ఉంటారని ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ కేంద్రంపై అనుమానాలు వ్యక్తం చేశారు. భద్రత పెంపునకు గల కారణాలు తనకు తెలియవని వ్యాఖ్యానించారు.
"ముగ్గురు వ్యక్తులకు జడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. మిగతా ఇద్దరూ ఎవరని అడగ్గా RSS చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని చెప్పారు. బహుశా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నా గురించి రహస్య సమాచారాన్ని సేకరించేందుకే ఈ ఏర్పాటు చేసి ఉండొచ్చు" అని శరద్ పవార్ గురువారం నవీ ముంబయిలో పవార్ ఆరోపించారు.
పవార్‌కు బుధవారమే కేంద్ర ప్రభుత్వం Z ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. ఈ క్రమంలో ఆయన కేంద్రంపై ఘాటు విమర్శలు చేయడం గమనార్హం.