Karnataka CM Letter To Modi: అసభ్య వీడియోల కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్టును రద్దు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సిద్ధరామయ్య లేఖ రాశారు. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను తిరిగి దేశానికి రప్పించడానికి సత్వరమే సమగ్రమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఎం కోరారు. దౌత్యపరమైన పాస్‌పోర్టు ద్వారా ఏప్రిల్ 27న ప్రజ్వల్ జర్మనీ పారిపోవడాన్ని సిగ్గుచేటు చర్యగా లేఖలో పేర్కొన్నారు. విదేశాంగ శాఖకు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం లేఖ పంపింది. మరోవైపు, కర్ణాటక ప్రభుత్వం పంపిన లేఖ తమకు అందిన్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
'ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయండి'- మోదీకి కర్ణాటక సీఎం లేఖ
Published : May 23, 2024, 12:06 PM IST