ETV Bharat / snippets

ఎట్టకేలకు చిక్కిన ఐదో కిల్లర్ తోడేలు- ఆరోదాని కోసం సెర్చ్ ఆపరేషన్!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 10:36 AM IST

Killer Wolf Caught
Killer Wolf Caught (ANI)

Killer Wolf Caught : ఉత్తర్​ప్రదేశ్​లోని బహ్రాయిచ్​ జిల్లాలో​ ఐదో 'కిల్లర్' తోడేలును అటవీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. దాన్ని రెస్క్యూ షెల్టర్​కు తరలించారు. ఇంకా మిగిలి ఉన్న మరో తోడేలును పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. త్వరలోనే దాన్ని పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము పట్టుకున్న తోడేలు ఆడదని వెల్లడించారు. 'ఆపరేషన్‌ భేడియా' ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. డ్రోన్ ద్వారా ఐదో తోడేలును పట్టుకున్నామని వివరించారు. ఆరో తోడేలును కూడా గుర్తించామని, దానిని మంగళవారమే పట్టుకునే అవకాశం ఉందని అన్నారు.

గత రెండు నెలలుగా తోడేళ్ల మంద బహ్రాయిచ్ జిల్లా ప్రజలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే 10 మందిపై దాడి చేసి చంపేశాయి. మరో 30 మందిని గాయపర్చాయి. ఈ క్రమంలో అటవీ శాఖ రంగంలోకి తోడేళ్ల మందలోని ఐదింటిని బంధించింది. మరో తోడేలు కోసం వెతుకుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.