రాష్ట్రంలో పాలన లేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది : కేటీఆర్ - KTR Comments On CM Revanth Reddy - KTR COMMENTS ON CM REVANTH REDDY
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2024, 2:32 PM IST
KTR Comments On CM Revanth Reddy : తెలంగాణ భవన్‌లో సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనే లేదని సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని విష జ్వరాలు విజృంభిస్తున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. గురుకులాల్లో పిల్లలు విష ఆహారం తిని అవస్థలు పడుతున్నారని గురుకుల టీచర్లను 2500 మందిని పక్కన పెట్టారని అన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టారని తమ ప్రభుత్వం వచ్చాక సకల మర్యాదలతో తొలగిస్తామని హెచ్చరించారు. కేసీఆర్, బీఆర్ఎస్ను తిట్టడం మానేసి ఇకనైనా రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.