ETV Bharat / snippets

హరియాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు డేట్​ ఫిక్స్- సీఎంగా నాయబ్​ సింగ్ సైనీ!

Haryana New Government Sworn
Haryana New Government Sworn (Getty Image, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2024, 1:42 PM IST

Haryana New Government Sworn : అక్టోబర్ 17న హరియాణాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. పంచకులలో ప్రమాణస్వీకారోత్సవం జరుగుతుందని బీజేపీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. హరియాణా సీఎంగా నాయబ్‌ సింగ్‌ సైనీ రెండోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ కొత్త సర్కార్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. మార్చి నెలలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్థానంలో నాయబ్‌ సింగ్‌ సైనీకి సీఎం పగ్గాలు కట్టబెట్టిన బీజేపీ, మళ్లీ అధికారంలోకి వస్తే తిరిగి ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తామని సంకేతాలు ఇచ్చింది. హరియాణాలో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా, బీజేపీ 48 సీట్లు, కాంగ్రెస్‌ 37 స్థానాల్లో గెలుపొందింది. INLD 2స్థానాలకు పరిమితం కాగా జేజేపీ, ఆప్‌ ఖాతా తెరవలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.