Chhattisgarh Naxal Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి గట్టి దెబ్బ తగిలింది. ఎదురుకాల్పుల్లో శనివారం ఉదయం 8 మంది మావోయిస్టులు హతం కాగా, ఓ భద్రతా సిబ్బంది అమరుడైనట్లు అధికారులు తెలిపారు. నారాయణపుర్ జిల్లా అబుజ్‌మడ్ ప్రాంతంలో గత రెండు రోజుల నుంచి ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. అంతర్ జిల్లాల యాంటీ నక్సల్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, ఎదురుకాల్పులు మొదలైనట్లు తెలిపారు. నారాయణపుర్, కొండగావ్, దంతేవాడ, కాంకేర్‌లోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్(STF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), 53వ బెటాలియన్‌కు చెందిన బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్- 8మంది నక్సలైట్లు హతం
Published : Jun 15, 2024, 12:29 PM IST