Badlapur Case Accused Gunned Down : మహారాష్ట్రలోని ఠాణె జిల్లా బద్లాపుర్‌లో ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు ఎదురు కాల్పుల్లో కాల్చి చంపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నిర్ధరించారు. బద్లాపుర్ పాఠశాలలో జరిగిన ఈ అత్యాచార ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో నిందితుడు అక్షయ్ శిందే (24)పై అతడి మొదటి భార్య పెట్టిన కేసులో ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తలోజా జైలుకు వెళ్లి, అక్కడి నుంచి నిందితుడిని కారులో తీసుకొని బద్లాపుర్‌కు బయలుదేరారు. ముంబ్రా బైపాస్‌కు చేరుకున్న సమయంలో కారులో ఉన్న పోలీసు అధికారి తుపాకీని లాక్కొన్న అక్షయ్, వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అక్షయ్‌తోపాటు పోలీసులు కూడా గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసుల ఎదురుకాల్పుల్లో 'బద్లాపుర్' అత్యాచార నిందితుడు హతం
Published : Sep 24, 2024, 7:16 AM IST