వాలంటీర్లతో ఎమ్మెల్యే రహస్య సమావేశం - 15 మందిపై కేసులు నమోదు - ysrcp Mla meeting with Volunteers - YSRCP MLA MEETING WITH VOLUNTEERS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 12:03 PM IST

Updated : Apr 3, 2024, 5:18 PM IST

YSRCP Mla Meeting With Volunteers at Narsipatnam: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నర్సీపట్నం ఎమ్మెల్యే వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం, ఈ విషయం బయటకు తెలియటంతో వారిని గదిలో దాచేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద 15 మందిపై కేసులు నమోదు చేస్తున్నట్టు ‌అధికారులు వెల్లడించారు.

Volunteers Locked in Room: స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఓ ఇంట్లో మంగళవారం రాత్రి వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేతలు అధికారులకు సమాచారం ఇచ్చి ఆ ఇంటి ముందు బైఠాయించారు. ఈలోపు కొందరు వాలంటీర్లు గోడ దూకి పారిపోయారు. ఎన్నికల బృందాలు ఇంటికి చేరుకుని తనిఖీ చేయగా ఓ గదికి తాళం వేసి కనిపించింది. గట్టిగా గద్దిస్తే లోపల ఉన్న వాళ్లు తలుపులు తెరిచారు. తెలుగుదేశం నేతలు అక్కడికి చేరుకునేటప్పటికే ఎమ్మెల్యే గణేష్‌ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. వాలంటీర్లను ఘటనాస్థలంలోనే వదిలేసి ఎమ్మెల్యే పరారై పారిపోయాడని, ఇది దేనికి సంకేతమని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపించాయి.

ఈ ఘటన వివాదానికి దారి తీసిన నేపథ్యంలో ఎన్నికల నియమావళి అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ ఘటనలో 15 మందిపై కేసులు నమోదు చేస్తున్నట్టు ‌నర్సీపట్నం ఆర్డీఓ జయరాం, డీఎస్పీ మోహన్​లు వెల్లడించారు. 

Last Updated : Apr 3, 2024, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.