ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అసంతృప్తి - పార్టీ కార్యక్రమాలకు దూరం - పి గన్నవరం నియోజకవర్గం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 7:04 PM IST
YSRCP MLA Kondeti Chittibabu not Attend for Party Meeting: పి. గన్నవరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలి పాలెంలోని ఫంక్షన్ హాల్లో పి. గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గైరాజరయ్యారు. తనను కాదని వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్గా విప్పర్తి వేణుగోపాలరావును ప్రకటించినప్పటి నుంచి ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
YSRCP Meeting In Gannavaram : ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త ఎంపీ మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తాను అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అయినా సిద్ధమని రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు వెల్లడించారు. మంత్రి విశ్వరూప్ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ చింత అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.