వైఎస్సార్సీపీ నేతల దాష్టీకం - సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై దాడి - YSRCP attack Pregnant Woman - YSRCP ATTACK PREGNANT WOMAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 9:09 AM IST
YSRCP Leaders Attack Pregnant Woman in Chittoor District : సార్వత్రిక ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగనున్న నేపథ్యంలో అధికార నేతల దాడులు, దౌర్జన్యాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. చిత్తూరు జిల్లాలో సమస్యలపై ప్రశ్నించినందుకు గర్భిణి అని కూడా చూడకుండా వైఎస్సార్సీపీ నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సతీమణి కవితమ్మ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున అనే వ్యక్తి ఇంటికి వెళ్లి వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి సతీమణి కవితమ్మ అభ్యర్థించారు. తమ వీధిలో కనీసం వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయలేదని మల్లికార్జన ప్రశ్నించాడు. చిన్నపిల్లలు చీకటిలో బయట తిరగలేకపోతున్నారని ఆమెకు తెలియజేశాడు. దీంతో ఆగ్రహించిన వైఎస్సార్సీపీ నేతలు మొదట మల్లికార్జునపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన కల్యాణిని నెట్టివేయడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను స్థానికులు 108 వాహనంలో మదనపల్లె ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తన భర్త మల్లికార్జునను, తనను చంపేస్తామని వైఎస్సార్సీపీ నాయకులు హెచ్చరించారని బాధితురాలు పేర్కొంది.