వైఎస్సార్సీపీ అభ్యర్థికి అసమ్మతి సెగ - జెండాలను కాళ్లతో తొక్కి, కాల్చివేసిన పార్టీ నేతలు - YSRCP Leader Dissenting - YSRCP LEADER DISSENTING
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 8:27 PM IST
YSRCP Leaders Adimulapu Satish Dissenting in Kurnool District : ఎన్నికలు ప్రచారం వెళ్లిన వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్‌కు అసమ్మతి సెగ తగిలింది. కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్. కానపురంలోని ఎన్నికల ప్రచారం వెళ్లిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో ప్రచారానికి వచ్చిన ఆయనకు సర్పంచ్ మునిస్వామి ఆధ్వర్యంలో వాల్మీకులు, రెడ్డి సామాజిక వర్గీయులు వైసీపీ జెండాలను కాళ్లతో తొక్కి, దహనం చేసిన విషయం ప్రస్తుతం హట్ టాపిక్ గా మారింది. వీటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
వైసీపీ జెండాలను కాళ్లతో తొక్కి, కాల్చివేస్తుంటే కొద్ది మంది వైసీపీ అభిమానులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత సమయం వరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ గ్రామానికి ఏం మంచి చేశారో చెప్పాలని ఆదిమూలపు సతీష్‌ను స్థానికులు నిలదీశారు. దీంతో చేసింది ఏమి లేక నేతలు వెనుదిరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనతో పాటు కర్నూల్ నగర చైర్మన్ హర్ష వర్థన్ రెడ్డి, కొత్తపేట గడ్డం ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నాారు.