గుడివాడలో అర్ధరాత్రి కొడాలి నాని అనుచరుల హల్‌చల్ - ఓటు నగదు కోసం స్థానికులు ఆందోళన - Kodali Nani Followers Halchal - KODALI NANI FOLLOWERS HALCHAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 7:55 AM IST
YSRCP Leader Kodali Nani Followers Halchal in Krishna District : ఓట్ల కొనుగోలుకు అధికారపక్షం అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తోంది. విచ్చలవిడిగా డబ్బు సంచులను కుమ్మరించి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడ లో అర్ధరాత్రి కొడాలి నాని అనుచరుల హల్చల్ చేశారు. నాగవరప్పడులో అర్థరాత్రి హడావుడిగా తలుపులు బాది, రోడ్లు మీదకి రావాలని స్థానికులకు కొడాలి నాని అనుచరులు హుకుం జారి చేశారు. లేచాక టిక్ పెట్టుకున్న కొంతమందికే డబ్బులు ఇస్తుంటే ఏం జరుగుతోందని ప్రజలు ప్రశ్నించడంతో వారిపై ఎదురు దాడి చేసేందుకు కొడాలి నాని అనుచరుల యత్నించారు. జనం ఎదురు తిరగడంతో అక్కడి నుంచి జారుకున్నారు.
నాగవరప్పడులో కొడాలి నాని అనుచరులు ఓటర్లుకు నగదు పంపిణీ చేస్తుండగా అధికార పార్టీకి చెందిన నగదు మాకు లేదంటూ స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు గాసిన నగదు పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాత్రముకు నిల్చో పెట్టడం ఎందుకు అని మండిపడ్డారు.