LIVE: వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ల ఐదో జాబితా విడుదల - ప్రత్యక్షప్రసారం - వైఎస్సార్సీపీ పార్టీ ఇన్చార్జీలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 8:27 PM IST
|Updated : Jan 31, 2024, 8:35 PM IST
YSRCP Incharges 5th List: రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లోని వైఎస్సార్సీపీ పార్టీ ఇన్చార్జీల మార్పులపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగియడంతో, ఇన్చార్జ్ల మార్పులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదో జాబితా విడుదల చేస్తోంది. పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గల మారిన వారి పేర్లతో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
పార్లమెంట్, అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జిలను మార్చుతోన్న సీఎం జగన్ ఇప్పటికే 4 జాబితాల్లో 59 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చేశారు. మరికొన్ని కీలక స్థానాల్లోనూ ప్రస్తుతం ఉన్న వారిని తీసివేసేందుకు కసరత్తు చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జీలు మార్పులతో అయిదో జాబితా సీఎం జగన్ రూపొందించారు. ఆ జాబితాను ప్రస్తుతం విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎంవో నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కొత్త వారిని నియమించడం, కొన్నింటిలో నేతలను అటు ఇటుగా మార్చే ప్రయత్నాలు చేశారు. నంద్యాల ఎంపీ స్థానం సహా శ్రీశైలం నియోజకవర్గంలో ఇన్ఛార్జీ మార్చాలని వైసీపీ యోచించింది.