ETV Bharat / press-releases

ఏపీ విద్యార్థులకు అడ్మిషన్లు నిలిపివేసిన తెలంగాణ ప్రభుత్వం - DISTANCE EDUCATION COURSES

అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఏర్పాటుపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం- ఉమ్మడి రాజధాని కాలం ముగియడంతో దూర విద్య చదివే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరం

distance_education_courses_students_problems_in_ambedkar_open_university
distance_education_courses_students_problems_in_ambedkar_open_university (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2025, 1:56 PM IST

Distance Education Courses Students Problems in Ambedkar Open University : గత వైఎస్సార్సీపీ సర్కారు నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా దూర విద్య కోర్సులు చదివే విద్యార్థుల భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారింది. పదేళ్ల ఉమ్మడి రాజధాని కాలం ముగియడంతో హైదరాబాద్‌లో ఉన్న అంబేడ్కర్ వర్సిటీ ద్వారా కోర్సుల్లో చేరలేని పరిస్ధితి నెలకొంది. గత ప్రభుత్వం రాష్ట్రంలో అంబేడ్కర్‌ ఒపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయకపోవడం వల్ల వేలాది మందికి అడ్మిషన్లు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి, రాష్ట్రంలో అంబేడ్కర్‌ ఒపెన్ వర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

గృహిణులు, విద్యార్థులు, ఉద్యోగుల పాలిట వరం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ. వివిధ కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన వారు, చిరుద్యోగులు పైచదువులు అభ్యసించేందుకు అద్భుత అవకాశం కల్పిస్తోంది ఈ యూనివర్సిటీ. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఏటా 30వేల మంది కొత్తగా కోర్సుల్లో చేరుతున్నారు. ఇంతటి కీలకమైన అంబేడ్కర్‌ యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.

ఫలితంగా ఏపీలోని లక్షలాది మంది విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌లో ఉన్న అంబేడ్కర్ విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడి ఆస్తిగా నిర్ణయించారు. పదేళ్లపాటు ఏపీ,తెలంగాణ వినియోగించుకునే అవకాశం కల్పించారు. గడువు ముగిసేలోపు అంబేడ్కర్‌ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేసుకుని విద్యార్థుల చదువులకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని చట్టంలో స్పష్టంగా వెల్లడించారు.

తెలంగాణ నుంచి అంధ్రప్రదేశ్ విడిపోయి గతేడాది జూన్ నాటికి పదేళ్లు పూర్తి కావడంతో అప్పటి నుంచి అంబేడ్కర్‌ వర్సిటీ తెలంగాణకు మాత్రమే పరిమతమైంది. 2024 జూలై నుంచి ఎపీ విద్యార్థులకు విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. గడువు ముగిసేలోపే ఏపీలో అంబేడ్కర్‌ దూర విద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసింది.

ఈ అధికారులకు ఏమైంది! ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై ఎందుకీ అలసత్వం?

ఈ విశ్వవిద్యాలయాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా, అమరావతిపై కక్ష కట్టిన జగన్ అక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయకుండా జాప్యం చేశారు. గడువు ముగియక ముందే విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చేయాలని విద్యావేత్తలు, సెంటర్ల నిర్వాహకులు, విద్యార్థులు జగన్ సర్కారుకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా బుట్టదాఖలు చేశారు. సీతారామయ్య, నిర్వాహకుడు అంబేడ్కర్‌ స్టడీ సెంటర్-శ్రీకాకుళం జిల్లా

అంబేడ్కర్‌ దూర విద్య విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏపీలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒకటి చొప్పున 13 రీజినల్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు మరో 63 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ప్రతి ఆదివారం క్లాసులు ఉంటాయి. గతంలో నిపుణులైన అధ్యాపకులను ఏర్పాటు చేసి తరగతులు నిర్వహించేవారు. దాదాపు 500మంది అధ్యాపకులు ఉండేవారు. గత ఐదేళ్లు పట్టించుకోకపోవడం వల్ల వేతనాలు నిలిచిపోయాయి. మరోవైపు గతంలో కోర్సుల్లో చేరిన 2లక్షల మందికి మరో మూడు నెలల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఎలా నిర్వహించాలో పాలుపోని పరిస్ధితి నెలకొంది.

ఏపీ అభ్యర్థులకు ఈ ఏడాది అంబేడ్కర్‌ యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇవ్వకపోవడంతో విద్యకు దూరమయ్యారు. ఈ నెలలో అడ్మిషన్లకు యూజీసీ మరోసారి అవకాశం కల్పించినందున విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, స్టడీ సెంటర్ల నిర్వాహకులు కోరుతున్నారు.

విద్యార్థులకు సబ్జెక్టుకు బదులు బైబిల్! - SVU ప్రొఫెసర్ అన్యమత ప్రచారంపై బజరంగ్​దళ్ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.