'ఎంతో చరిత్ర కలిగిన కడపను విస్మరించారు - వైఎస్సార్‌ జిల్లా పేరు మార్చాలి' - YSR district name change demand

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 9:29 AM IST

thumbnail
'ఎంతో చరిత్ర కలిగిన కడపను విస్మరించారు - వైఎస్సార్‌ జిల్లా పేరు మార్చాలి' (ETV Bharat)

YSR District Name Change Demand: వైఎస్సార్ కడప జిల్లా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్సార్‌ జిల్లా పేరు మార్చాలని అఖిలపక్ష పార్టీ నేతలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కడప ఎస్‌టీయూ భవన్​లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యార్థి సంఘాలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత 2010లో ప్రభుత్వం వైయస్సార్ కడప జిల్లాగా పేరు మార్చిందని, కానీ జగన్ రాగానే వైఎస్సార్ జిల్లా అని మాత్రమే పేరు పెట్టారని అన్నారు. కానీ గత ప్రభుత్వం కడపను తొలగించి వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చడం దుర్మార్గమని ఖండించారు. 

ఎంతో చరిత్ర కలిగిన కడపను విస్మరించారన్నారు. కేవలం రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో కడప పేరును తొలగించడం సబబు కాదని నాయకులు మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లాగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చేంత వరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.