పేరు మారింది- మంగళగిరిలోని ఎన్టీఆర్ వైద్య సేవా కేంద్రంగా ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ - NTR Medical Service Center Guntur - NTR MEDICAL SERVICE CENTER GUNTUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 2:47 PM IST
YSR Arogya Sri Trust name Changed as NTR Medical Service Center IN Guntur : గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరును ఎన్టీఆర్ వైద్య సేవా కేంద్రంగా మార్చారు. గుంటూరుకి చెందిన టీడీపీ నేతలు కసుకుర్తి హనుమంతరావు, పొదిలి వాసు, సురేంద్రబాబు ఇతర నేతలు మంగళగిరిలోని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయం పై వైఎస్ఆర్ పేర్లు తొలగించి ఎన్టీఆర్ వైద్య సేవ కేంద్రంగా ఫ్లెక్సీ తగిలించారు.
ఇదిలా ఉండగా గంతంలో ఆరోగ్య శ్రీ బిల్లుల విషయమై తెరపైకి వచ్చిన విషయం విధితమే. ఆరోగ్య శ్రీ చికిత్సలకు సంబంధించి బిల్లులు ప్రభుత్వం 6 నెలల నుంచి బకాయిలు పడటంతో ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. బిల్లుల చెల్లింపుపై పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా స్పందన లేని కారణంగానే కొన్ని సంఘాలు నోటీసులు ఇచ్చాయని చెప్పారు.