LIVE : హైదరాబాద్‌లో వైఎస్ సునీత మీడియా సమావేశం - YS SUNITHA LIVE - YS SUNITHA LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 15, 2024, 11:11 AM IST
|Updated : Apr 15, 2024, 12:43 PM IST
YS Sunitha Press Meet Live: రాష్ట్ర సీఎం చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధరించలేదని సునీత ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా?, మీ చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? అని నిలదీశారు. తన పైనే కేసులు పెట్టడం ఏమైనా న్యాయమా? అని సునీత వాపోయారు. చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచిందన్న సునీత ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారని? జగన్‌ను ప్రశ్నించారు.ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడటం సరికాదని, జగన్ చేయాల్సిన పని సరిగ్గా చేయనందునే బయటకు రావాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని చెబుతున్నారే తాను చెప్పేదంతా నిజం ఆమెలాగే ఆయన చెప్పగలుగుతారా? అని కడిగిపారేశారు. వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారన్న సునీత హత్య చేసిన వ్యక్తి తనను ఎవరు ప్రేరేపించారో, ఎవరు చంపించారో స్పష్టంగా చెబుతున్నారని గుర్తు చేశారు. నిందితుల వెనక అవినాష్, భాస్కర్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నా, జగన్ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ సునీత పాల్గొన్నారు.
Last Updated : Apr 15, 2024, 12:43 PM IST