నిజమే చెబుతున్నా వాళ్లు చాలా మంచోళ్లు - అభూత కల్పనతో నిందలు వేయకండి: జగన్ ఊవాచ - YS Jagan on Madanapalle Incident - YS JAGAN ON MADANAPALLE INCIDENT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-07-2024/640-480-22053507-thumbnail-16x9-jagan-on-madanapalle-incident.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 4:47 PM IST
|Updated : Jul 26, 2024, 4:59 PM IST
YS Jagan on Madanapalle Sub Collectorate Incident: మదనపల్లె సబ్‌కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఘటనపై చేస్తున్న ప్రచారం అభూత కల్పన అని మాజీ సీఎం, ఎమ్మెల్యే జగన్ అన్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు కాలిపోవటానికి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ప్లాన్ చేసినట్టు వారిపై నిందలు వేస్తూ అభాసుపాలు చేస్తున్నారని అన్నారు. లేనివి కల్పించి వారిపై నిందలు వేసి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిపై బురదజల్లుతున్నారని జగన్ రెడ్డి మండిపడ్డారు.
పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మంచోళ్లు కాబట్టే ప్రజలు గతంలో గెలిపించారని అన్నారు. దస్త్రాలు కాలిపోతే అధికార యంత్రాంగం హడావుడి చేయటం ఆశ్చర్యం కలిగిస్తోందని ఎమ్మెల్యే జగన్ పేర్కొన్నారు. మరోపక్క మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనం ఘటనకు సంబంధించి నాలుగో రోజు విచారణ ముమ్మరంగా సాగుతోంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్పి సిసోదియా మూడు జిల్లాల కలెక్టర్ల, ఆర్డీవోలు, తహశీల్దారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కేసు పురోగతిపై జిల్లా పోలీసులతో సమీక్ష నిర్వహించారు.